Saturday, July 26, 2008

ఆశ


ఆశ,

ఇంకా తెల్లగా కావాలని.


చూస్తాను.

"మేము మారుస్తాం"

అనే ప్రకటన

కొన్ని వందల సార్లు ఏదో టీవీ లో.


నిజమని నమ్మి కొంటూనే వుంటాను

ఒకసారి,రెండుసార్లు......కొన్నివందల సార్లు.

ఎప్పటికైనా మారుస్తుందేమో అని.


ఆపరేం

కొన్ని కోట్లమందిని

మోసగిస్తున్న ఈ ప్రకటనలని

ఎవరూ

ఎందుకు?

3 comments:

  1. భలే వాళ్ళే. మీరు చైతన్యం తెచ్చెసి, ఎంతమంది ఉపాధి కొల్ల గొట్టేయ్యాలని చూస్తున్నారో మీకు తెలుసా ? మన దేశంలో అమ్మాయిలూ, అబ్బాయిలూ 'చూడండర్రా ! కొబ్బరాకుల్ని నూరి, ఆ పేస్టు మొహానికి పట్టించండి - కాంతి, కళ, వన్నే (తెల్ల రంగు) వస్తాయీ అని చెప్తే తూ.చా. తప్పకుండా పాటించేస్తారు.


    తెల్లదనానికీ, అందానికీ, ఆకర్షణకూ అత్యధిక ప్రాధాన్యత ను ఇచ్చే తరం మనది. అందుకే, మార్కెట్లో 200 కు మించిన ఫెయిర్ నెస్ క్రీములు ఉన్నాయి. దీనికి ఆక్షేపణేముంది ?


    బహిర్ సౌందర్యం కన్నా, చక్కని భాష, వ్యక్తిత్వం, భావ వ్యక్తీకరణ సామర్ధ్యం, శుభ్రత లాంటి క్వాలిటీలు మనిషికి మంచి గుర్తింపుని ఇస్తాయి. ఈ సూత్రం తెలిసిన బ్యూటీ పార్లర్లు ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్, పెర్సనాలిటీ డెవెలప్మెంట్ కోర్సులు కూడా మొదలు పెడుతున్నాయి.


    కాలాన్ని బట్టీ క్రీములు మరి !

    ReplyDelete
  2. సుజాత గారు,మనదేశములో రంగుకున్న ప్రాముఖ్యం ఇవ్వాళ్తిది కాదు.కొన్ని కులాల్లో రంగున్న పిల్లకు కట్నంలో రిబేటు కూడా ఉంటుంది.పచ్చటి రంగులో ఉండే మామేనత్తలు నన్ను ఎవరికన్నా పరిచయం చెస్తూ,మా వదినలాగా నల్లగా పుట్టాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు.
    ఒక పుస్తకంలో అంబేద్కర్ ఈ తెల్లరంగు మీద భారతీయులుకున్న మోజును గురించి ప్రస్తావిస్తూ నాటి టైంస్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చే పది వివాహప్రకటనల్లోనూ తొమ్మిది తెల్లరంగున్న అమ్మాయిలే కావాలంటారని,ఆనాటి అంటే నాకు సరిగ్గా గుర్తులేదు గానీ బహుశా 1920-30 లోనో అనుకుంటా రాసారు.
    ఇవ్వాళ్టి తెల్లదనం,నాజూకుదనం మీది మోజు ఐశ్వ్ర్యారాయి,సుస్మితాసేన్ తదితర అందాలరాణులు దేశం నెత్తిన రుద్దిన వేపాక్జుల పసరు.....

    ReplyDelete
  3. సుజాత గారు,
    నేను ఆపాలంటున్నది మోసపూరితమైన అన్ని వాణిజ్య ప్రకటనలని .
    మంచిగా కనిపించాలనే ఆలొచనను కాదు.

    ReplyDelete

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...