కళ్ళు తిప్పుకోనీయని అత్యద్భుత అందం తో
సుదూరాలు వ్యాపించే మైమరిపించే పరిమళం తో
ఓ పూల దండ.
ఒద్దికగా కలిపి ఉంచబడిన వేర్వేరు రంగు పూలు
ప్రతి దాని రంగూ ప్రాముఖ్యంగా కనిపించేలా,
స్వల్పమైన విడి పూల సువాసనలన్నీ కలపబడి
అందరినీ మైమరిపిస్తున్న పరిమళం.
ఏన్నో మెచుకోళ్ళు
మరెన్నో గౌరవాలు ,ఆశ్చర్యాలు ఆ పూదండపై.
హఠాత్తుగా ఓ రోజు పూదండ దారం తెగిపోయింది .
ఒద్దికగా ఉన్న పూలన్నీ చెల్లచెదురయ్యాయి.
కలిపిఉంచబడినప్పటి అందం కోల్పోయాయి.
అప్పటిదాకా మైమరిపించిన పరిమళం స్వల్పమైపోయింది.
విడిపూల గౌరవం తగ్గిపోయింది.
పూలు మంచివి అవడమే కాదు,
వాటిని కలిపిఉంచే వారూ అతి ముఖ్యమే.
ఫూదండల పరిమళాలని పెంచడానికైనా,
సమూహాలు ఏదైనా సాధించడానికైనా
అన్నిటినీ కలిపిఉంచే ఓ సాధనం కావాలి.
ఇదీ పూదండ దారం తెలిపిన ఓ సత్యం.
(నాయనమ్మ గుర్తుగా)
(కిరణ్ శ్రీ రాం కు మరియు లీడర్స్ అందరికీ)
సుదూరాలు వ్యాపించే మైమరిపించే పరిమళం తో
ఓ పూల దండ.
ఒద్దికగా కలిపి ఉంచబడిన వేర్వేరు రంగు పూలు
ప్రతి దాని రంగూ ప్రాముఖ్యంగా కనిపించేలా,
స్వల్పమైన విడి పూల సువాసనలన్నీ కలపబడి
అందరినీ మైమరిపిస్తున్న పరిమళం.
ఏన్నో మెచుకోళ్ళు
మరెన్నో గౌరవాలు ,ఆశ్చర్యాలు ఆ పూదండపై.
హఠాత్తుగా ఓ రోజు పూదండ దారం తెగిపోయింది .
ఒద్దికగా ఉన్న పూలన్నీ చెల్లచెదురయ్యాయి.
కలిపిఉంచబడినప్పటి అందం కోల్పోయాయి.
అప్పటిదాకా మైమరిపించిన పరిమళం స్వల్పమైపోయింది.
విడిపూల గౌరవం తగ్గిపోయింది.
పూలు మంచివి అవడమే కాదు,
వాటిని కలిపిఉంచే వారూ అతి ముఖ్యమే.
ఫూదండల పరిమళాలని పెంచడానికైనా,
సమూహాలు ఏదైనా సాధించడానికైనా
అన్నిటినీ కలిపిఉంచే ఓ సాధనం కావాలి.
ఇదీ పూదండ దారం తెలిపిన ఓ సత్యం.
(నాయనమ్మ గుర్తుగా)
(కిరణ్ శ్రీ రాం కు మరియు లీడర్స్ అందరికీ)
It's really awesome ra. Thank you for ur love on me.
ReplyDelete