Thursday, December 10, 2009

బాధేస్తోంది విడివడడం అంటేనే.

ఓ సామాన్య మానవుడిగా

బాధేస్తోంది

విడిపోవడం అంటేనే.


నాకు తెలుసు

విడిపోయినా ,కలిసున్నా

నాకు మారేది ఏమీ ఉండదని.

ఐనా ఏదో బాధ.


విడిపడి బాగు పడతాంఅని వారంటున్నారు.

చీలికలై చులకనౌతాం అని కొందరంటున్నారు.
ఏది సరైందో ,

అందరికీ ఏది ఎక్కువ మేలు చేస్తుందో

అర్ధం కాని సామాన్యుడ్ని .

ఐనా

ఏదో బాధ గుండెల్లొంచి నిజంగా.


నిజమైన ప్రజల మాటల్లో

స్వచ్చత వుంటుంది చాలా వరకూ.

కానీ

రాజకీయ గుంటనక్కల్నే

విశ్వసించలేకపోతున్నా.

నాకు తెలుసు

వారిని ఎన్నుకున్నాక

నా నిమిత్తం వుండదు మంచికైనా, చెడు కైనా.


ఐనా

స్వానుభవం చెబుతోంది

రాజకీయ పక్షాలు చేసే ప్రతి పనిలోనూ

స్వార్ధ పూరిత స్వలాభం ముందు,

ఆ తరువాతేఏ ప్రజా శ్రేయస్సైనా అని.


ఇన్ని తెలిసీ

బాధేస్తోంది విడివడడం అంటేనే.

కోరుకుంటున్నా అందరికీ మంచి జరగాలని.

9 comments:

  1. ఇల్లలక గానే పండగ కాదు లెండీ. అప్పుడే బాధ పడనవసరం లేదు.

    ReplyDelete
  2. మీ టపాకి నేను కూడా అంగీకరిస్తున్నాను. విడిపోవడం వద్దు. సమైక్యవాదమే ముద్దు.

    ReplyDelete
  3. nijaanni chaala baaga chepparu.. very good

    ReplyDelete
  4. చాలా బాగా చెప్పారు. విడిపోవడం అనేది యే రూపమైనా బాధాకరమే.

    మతం కోసం మారణకాండలు చేస్తున్నాం
    కులం కోసం సమిష్టి విలువలు కూల్చేస్తున్నాం
    ప్రాంతం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నాం
    వీటన్నింటిని సృష్టించిన మనిషిని మాత్రం చంపేస్తున్నాం

    మారదాం…మారుద్దాం

    మతం గోల మానేసి మానవత్వం చాటుకుందాం
    కులం గోడ కూల్చేసి సమిష్టి బలం పెంచుకుందాం
    ప్రాంతం కంటే మనిషి ప్రాణం గొప్పదని తెలుసుకుందాం
    చేతిలో చెయ్యేసి అడుగులో అడుగేసి ఒక్క జాతిగా మసలుకుందాం

    ReplyDelete
  5. ఎప్పుడో అప్పుడు తప్పదు బ్రదర్ విడిపోవడం........మంచి జరుతునప్పుడు ఎందుకు బాద

    ReplyDelete
  6. నేను కూడా సమైఖ్యాంద్రాకే జై కొడతా..

    ReplyDelete
  7. thyagamurthulantha telangana bayatane unnattunnaru. Please take back more than 50 thousand employees who are working in Telangana region without respecting spirit of mulki rules/six point formula and 610 GO.

    Everyone in Telangana is same w.r.t as per mulki rules but in the name later GOs divided us into zones and now trying to make Hyderabad free zone which definitely added fuel to the fire.

    Want to write in TELUGU... but little bit pain at this point so please bear with me.

    ReplyDelete
  8. నిజమే కాని కలహాల కాపురం ఎన్నాళ్ళు. ఎకోదరులుగా పుట్టిన అన్నదమ్ములే వీడక తప్పడం లేదు. వీడినా సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు ఈ వ్యవస్థలో. పైపై మెరుగులు తప్ప. మీ ఆవేదన అర్థవంతం.

    ReplyDelete

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...