Friday, August 27, 2010

తిరస్కారం- పాఠం

ఆకాశం తిరస్కరించిందని
ఓ మేఘం
అతిగా కన్నీటిని వర్షిస్తూ
లోకం నుండి అదృశ్యమవ్వాలని
ప్రయత్నిస్తున్న క్షణంలో
నేననుకున్నాను "ఇంత పిచ్చా?" అని

కొండ కాదందని
అంతెత్తు నుండీ ఓ జలపాతం
దూకడానికి సిద్దమౌతున్న క్షణంలో
నేనను కున్నాను"అతి పనికి రాదు"అని.

కానీ
ఇపుడర్ధం అవుతోంది
అతిగా వాంచింపబడినదాని నుండి వచ్చే తిరస్కారం తో
మనసున కలిగే భావాలేంటో .

అయినా
తమ భావాలను నియంత్రించి
మేఘం ఓ చోట నేలనూ
జలపాతం
ఓ నదినీ జీవింపజేయడం చూసి
తెలుసుకున్నా ఓ పెద్ద జీవిత పాఠం

Thursday, April 15, 2010

ఎండాకాలం - ప్రకృతి

రోజంతా భరించలేనంత వేడి


నా శరీరాన్ని బాధిస్తోంది,


చిన్నప్పుడు క్రికెట్ ఆడి ఆలస్యంగా ఇంటికి వస్తే


నాన్న కొట్టిన దెబ్బల్లా.



సాయంత్రమైతే చాలు


ఎంతటి అలసటనైనా మరిపించే


అతి చల్లటి గాలి

నన్ను చుట్టుకుంటుంది


ఎంతటి కష్టాన్నైనా మైమరిపించే అమ్మ ప్రేమలా .


నేను దారి తప్పుతున్నప్పుడు


సరి చేయడానికి


నాన్నను పంపిన అమ్మే గుర్తొస్తోంది


మధ్యాహ్నం లేకుండా సాయంత్రం ప్రత్యక్షమౌతున్న చల్లని గాలిని చూస్తుంటే.



నా మొహం చూడగానే


కొన్ని సార్లు వెంటనే


ఓదార్చేందుకు అమ్మను పంపే నాన్నే గుర్తొస్తున్నాడు


ఉదయాలు బాధ పెట్టి


సాయంత్రాలు వెన్నెల వెలుగులకు కారణమయ్యే సూర్యుని చూస్తుంటే.


ప్రకృతిని ఎంత శోధించినా ఆశ్చర్యమేగా మానవునికి .

Thursday, March 4, 2010

తోడు

భూమీ , పైరూ

కలపబడ్డాయి

ఓ శుభ ముహూర్తం లో

యజమానులైన పెద్దలచే.
భూమి

చాల అందం గా తయారై కనిపించేది

తోడుగా పైరు ఉండగా భరోసాతో.

పైరు చాలా శక్తి తో

ఉత్సాహంగా కనిపించేది

భూమి తనపై తీసుకునే శ్రద్ధతో .


పైరు మరణించింది

ఓ రోజు హఠాత్తుగా .
అంతే

బద్దలైంది

భూమి హృదయం,

అందవిహీనమైంది

దాని శరీరం నెర్రెలతొ.

కనీసం

నీరు పెట్టే వారు కూడా లేరు

ఇపుడు దానికి,

పంట లేదని.

జతకట్టబడితే బాగుండు,
ఆ భూమి త్వరగా

తనకు నచ్చిన ఏ పైరుతో అన్నా .

ఒంటరిగా ఉండడం కష్టం కదా !జీవితాంతం.

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...