Thursday, December 10, 2009

బాధేస్తోంది విడివడడం అంటేనే.

ఓ సామాన్య మానవుడిగా

బాధేస్తోంది

విడిపోవడం అంటేనే.


నాకు తెలుసు

విడిపోయినా ,కలిసున్నా

నాకు మారేది ఏమీ ఉండదని.

ఐనా ఏదో బాధ.


విడిపడి బాగు పడతాంఅని వారంటున్నారు.

చీలికలై చులకనౌతాం అని కొందరంటున్నారు.
ఏది సరైందో ,

అందరికీ ఏది ఎక్కువ మేలు చేస్తుందో

అర్ధం కాని సామాన్యుడ్ని .

ఐనా

ఏదో బాధ గుండెల్లొంచి నిజంగా.


నిజమైన ప్రజల మాటల్లో

స్వచ్చత వుంటుంది చాలా వరకూ.

కానీ

రాజకీయ గుంటనక్కల్నే

విశ్వసించలేకపోతున్నా.

నాకు తెలుసు

వారిని ఎన్నుకున్నాక

నా నిమిత్తం వుండదు మంచికైనా, చెడు కైనా.


ఐనా

స్వానుభవం చెబుతోంది

రాజకీయ పక్షాలు చేసే ప్రతి పనిలోనూ

స్వార్ధ పూరిత స్వలాభం ముందు,

ఆ తరువాతేఏ ప్రజా శ్రేయస్సైనా అని.


ఇన్ని తెలిసీ

బాధేస్తోంది విడివడడం అంటేనే.

కోరుకుంటున్నా అందరికీ మంచి జరగాలని.

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...