నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్నా. మనిద్దరి లక్ష్యం ఒకటే. నేనూ నీవైపు నుండే వచ్చా , నువు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఎదుర్కొని కస్టపడి అగాథాన్ని దాటి వచ్చా. మనిద్దరి లక్ష్యం ఒకటే. న్యాయమైన మన లక్ష్యానికీ మనకి మధ్య ఎన్నో అవరోధాలు. నువ్వంటావు, నేను నిన్ను పట్టించుకోలేదని, నేనంటాను నువు నన్ను గౌరవించలేదని . పెద్ద అగాథం మనిద్దరి మధ్యా. నువేమో మన పిల్లలకు యుద్ద విద్య నేర్పిస్తావ్, నేనేమో మన పిల్లలు రోడ్లమీదకు రాకూడదంటాను. లక్ష్య సాధన లో మన పిల్లలు బలి కాకూడదంటాను, ఆ అవసరమే రాకూడదు అంటాను. అగాథం మనిద్దరి మధ్య. నువ్వంటావు లక్ష్య సాధనకు బహిరంగ పోరాటం చేయమని, నేనంటానూ లక్ష్య సాధనకు అదొక్కటే మార్గం కాదని , నీ మార్గం లో నడవని వాళ్ళందరూ మోసకారులు ,దగాకోరులూ కాదని. అగాథం మనిద్దరి మధ్య. లక్ష్యం మాత్రం ఒకటే. నువేమో నాయకుడు నాయకుడు అంటావు , నేనేమో నాయకులు కావాలంటాను. ఒకరి మీదే ఆధారపడొద్దు అంటాను. అగాథం మనిద్దరి మధ్య. లక్ష్యం మాత్రం ఒకటే. నీకూ నాకూ మధ్య ఉన్న అగాథాన్ని దాటలేక , దాటే మార్గం చెప్పే వారు లేక , అగాథం లో పడిపోయిన మన పిల్లల్ని చూడు . మన పిల్లలు వేరెవరూ పడకుండా ముందు ఓ బలమైన వంతెన నిర్మిద్దాం రా నీకూ నాకూ మధ్య. అగాథాలు అన్నీ పూరింపబడిన రోజు లక్ష్యం తలవంచి మన కాళ్ళ కిందికొస్తుంది , మన పిల్లలకు అవకాశాలు పెరిగే రోజొస్తుంది... ఆ రోజున మనను ఆపేవాడెవ్వడు? ముందు ఓ బలమైన వంతెన నిర్మిద్దాం రా మన మధ్య.
|
Thursday, August 1, 2019
వంతెన నిర్మిద్దాం రా!
Subscribe to:
Posts (Atom)
వంతెన నిర్మిద్దాం రా!
నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...
-
కళ్ళు తిప్పుకోనీయని అత్యద్భుత అందం తో సుదూరాలు వ్యాపించే మైమరిపించే పరిమళం తో ఓ పూల దండ. ఒద్దికగా కలిపి ఉంచబడిన వేర్వేరు రంగు పూలు ప...
-
ఓ సామాన్య మానవుడిగా బాధేస్తోంది విడిపోవడం అంటేనే. నాకు తెలుసు విడిపోయినా ,కలిసున్నా నాకు మారేది ఏమీ ఉండదని. ఐనా ఏదో బాధ. విడిపడి బాగు పడతాం...
-
ఒక లేత సన్నజాజి తీగె రోజూ చూస్తూఉంటా దాని ఆరాటం . దేనినో హత్తుకోవాలని , గట్టిగా చుట్టుకొని పైపైకి సాగాలని. తన పిలుపే సరిగాలేదో లేక ...