Thursday, December 10, 2009

బాధేస్తోంది విడివడడం అంటేనే.

ఓ సామాన్య మానవుడిగా

బాధేస్తోంది

విడిపోవడం అంటేనే.


నాకు తెలుసు

విడిపోయినా ,కలిసున్నా

నాకు మారేది ఏమీ ఉండదని.

ఐనా ఏదో బాధ.


విడిపడి బాగు పడతాంఅని వారంటున్నారు.

చీలికలై చులకనౌతాం అని కొందరంటున్నారు.
ఏది సరైందో ,

అందరికీ ఏది ఎక్కువ మేలు చేస్తుందో

అర్ధం కాని సామాన్యుడ్ని .

ఐనా

ఏదో బాధ గుండెల్లొంచి నిజంగా.


నిజమైన ప్రజల మాటల్లో

స్వచ్చత వుంటుంది చాలా వరకూ.

కానీ

రాజకీయ గుంటనక్కల్నే

విశ్వసించలేకపోతున్నా.

నాకు తెలుసు

వారిని ఎన్నుకున్నాక

నా నిమిత్తం వుండదు మంచికైనా, చెడు కైనా.


ఐనా

స్వానుభవం చెబుతోంది

రాజకీయ పక్షాలు చేసే ప్రతి పనిలోనూ

స్వార్ధ పూరిత స్వలాభం ముందు,

ఆ తరువాతేఏ ప్రజా శ్రేయస్సైనా అని.


ఇన్ని తెలిసీ

బాధేస్తోంది విడివడడం అంటేనే.

కోరుకుంటున్నా అందరికీ మంచి జరగాలని.

Thursday, September 3, 2009

అలసిన మనసుతో........

తెలియని తపనేదో
నను తరుముతు ఉంటే,
పరుగెడుచున్నాను
తుది ఎరుగని గమ్యానికి.

చేరిన
ప్రతి మజిలీ
తుది మజిలీ
తను కాదని అనిపిస్తుంటే,
అపరిమిత
అనుభవ మూటను మోసుకుంటూ
నిత్యాసంతృప్తితో
అలసిన మనసుతో
పరుగులెడుతూ ,
మనసుని
సంపూర్తిగా సంతృప్తిపరిచే
తుది మజిలీ శోధిస్తూ ,

అపుడపుడూ
సేద తీరుతున్నా,
మనసుని మాటల్లోకి మారుస్తూ.

Friday, July 3, 2009

అయస్కాంతం.

ఓ అయస్కాంతం.
తన పరిధిలోనికి వచ్చిన
ప్రతి మంచి ఇనుమునీ
ఆకర్షించడం, వాటిచే ఆకర్షించబడడం
దాని లక్షణం.
ఇవాళ దాన్ని
ఓ మంచి ఇనుముతో కట్టేసారు.
ఇక,
ఈ అయస్కాంతం మరణించి
తన సహజత్వాన్ని కోల్పోతుందా?
లేక
తన సహజత్వాన్ని నిలుపుకుంటుందా?
లేక
ఈ ఇనుము
అయస్కాంత ఆకర్షణా శక్తి నంతా
నశింప చేస్తుందా?
ఎదురు చూస్తున్నా...
ఏమవుతుందా అని.

Monday, March 9, 2009

పోలీసులో? టెర్రరిస్టులో ?

ఇద్దరు కుర్రోళ్ళు

చాలా మామూలుగా

ఓ టీ షర్టు , ప్యాంటు వేసుకొని

పొడవాటి గన్ లను పట్టుకొని

ఎదురొస్తూ కనిపించారు.

ఈ మధ్య జరిగిన సంఘటనలు గుర్తొచ్చి

తత్తర పడి,తేరిపార చూసా వాళ్ళిద్దరి వైపూ.

ఓ చిన్న గర్వం తొణికిసలాడే

చూపు విసిరి ముందుకెళ్ళారు వాళ్ళిద్దరూ.

దేశ రక్షణకై ప్రాణాలు పెట్టడానికి

సిద్దపడ్డ ఏ పోలీసులో ఐతే

వాళ్ళిద్దరూ

ఆ చిన్న గర్వానికి అర్హులే.

కానీ

ఈ త్యాగధనులకు,ఆ టెర్రరిస్ట్ నా కొడుకులకూ

తేడా తెలిసేది ఎలా? ఏ సామాన్యుడికైనా...


ఈ చిన్న విషయం

వాళ్ళకు గన్ లు ఇచ్చిన

పెద్ద అధికారులకు తెలియలేదా?

లేక

మన ఇద్దరు కుర్రోళ్ళు అతి ఉత్సాహం తో

తమ డ్రస్ నిబంధనలు మరిచారా?

ఏదైతేనేం

నాకు అప్పుడు వాళ్ళు

పోలీసులో, టెర్రరిస్టులో

ఖచ్చితంగా అర్థం కాలేదు.

Tuesday, February 3, 2009

కాలము - దేవుడు



కొన్ని సార్లు

అసలు

ఏమీ కష్టపడని పని లో కూడా

ఊహించని విజయం సాధించి

అభినందనల వెల్లువలో మునిగిపోతున్నప్పుడూ...,

మరికొన్ని కొన్ని సార్లు

ఎంత కష్టపడినా రావలసిన ఫలితం రాక

అతి ఘోరంగా తిట్లు తిన్నప్పుడూ ....,

నాకు అనిపిస్తుంది

నేను కనిపెట్ట లేని ,

ఊహించలేని పెరామీటర్ ఏదో

ఈ ఫలితాలను నిర్దేశిస్తోందని.

అతి ప్రశాంతంగా సాగుతున్నట్టు కనిపించే కొన్ని జీవితాలు

హఠాత్తుగా

అధో పాతాళానికి పడిపోయి

అతికించలేనంతగా బ్రద్దలైనప్పుడూ...,


సమస్యల సుడిగుండాల్లో చిక్కుపడి

ఎవరూ వీరిని రక్షించలేరు అనిపించే జీవితాలు

సాఫీగా , అతి సులువు గా పరిష్కార తీరాలను చేరినపుడూ....,

మళ్ళీ

అదే అనుభూతి.

నేను కనిపెట్టలేనిది ఏదో నిర్దేశిస్తోంది

ఈ అంతిమ ఫలితాల్ని .


ఎంత ఆలోచించినా

ఒక సంఘటన జరిగే ప్రాబబిలిటీ తప్ప

అది జరుగుతుందా , లేదా అని ఖచ్ఛితంగా చెప్పలేదు

అత్యంత అభివృద్ది చెందిన నా గణితం.

అప్పుడు

ఏ సంఘటనా ఫలితాన్నైనా నిర్దేశించే

ఆ వేరియబుల్ పెరామీటర్

' కాలము ' అనీ,

ఆ వేరియబుల్ ని నిర్దేశించే వాడు

'దేవుడు ' అనీ

మనకు తెలిసిన థియరీ నే మళ్ళీ గుర్తుచేసుకుంటా ..,

దాన్ని

రైటనో, కాదనో ప్రూవ్ చేయగల

గొప్ప శాస్త్రవేత్త కోసం ఎదురు చూస్తూ .....!

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...