Tuesday, February 3, 2009

కాలము - దేవుడు



కొన్ని సార్లు

అసలు

ఏమీ కష్టపడని పని లో కూడా

ఊహించని విజయం సాధించి

అభినందనల వెల్లువలో మునిగిపోతున్నప్పుడూ...,

మరికొన్ని కొన్ని సార్లు

ఎంత కష్టపడినా రావలసిన ఫలితం రాక

అతి ఘోరంగా తిట్లు తిన్నప్పుడూ ....,

నాకు అనిపిస్తుంది

నేను కనిపెట్ట లేని ,

ఊహించలేని పెరామీటర్ ఏదో

ఈ ఫలితాలను నిర్దేశిస్తోందని.

అతి ప్రశాంతంగా సాగుతున్నట్టు కనిపించే కొన్ని జీవితాలు

హఠాత్తుగా

అధో పాతాళానికి పడిపోయి

అతికించలేనంతగా బ్రద్దలైనప్పుడూ...,


సమస్యల సుడిగుండాల్లో చిక్కుపడి

ఎవరూ వీరిని రక్షించలేరు అనిపించే జీవితాలు

సాఫీగా , అతి సులువు గా పరిష్కార తీరాలను చేరినపుడూ....,

మళ్ళీ

అదే అనుభూతి.

నేను కనిపెట్టలేనిది ఏదో నిర్దేశిస్తోంది

ఈ అంతిమ ఫలితాల్ని .


ఎంత ఆలోచించినా

ఒక సంఘటన జరిగే ప్రాబబిలిటీ తప్ప

అది జరుగుతుందా , లేదా అని ఖచ్ఛితంగా చెప్పలేదు

అత్యంత అభివృద్ది చెందిన నా గణితం.

అప్పుడు

ఏ సంఘటనా ఫలితాన్నైనా నిర్దేశించే

ఆ వేరియబుల్ పెరామీటర్

' కాలము ' అనీ,

ఆ వేరియబుల్ ని నిర్దేశించే వాడు

'దేవుడు ' అనీ

మనకు తెలిసిన థియరీ నే మళ్ళీ గుర్తుచేసుకుంటా ..,

దాన్ని

రైటనో, కాదనో ప్రూవ్ చేయగల

గొప్ప శాస్త్రవేత్త కోసం ఎదురు చూస్తూ .....!

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...