Thursday, April 15, 2010

ఎండాకాలం - ప్రకృతి

రోజంతా భరించలేనంత వేడి


నా శరీరాన్ని బాధిస్తోంది,


చిన్నప్పుడు క్రికెట్ ఆడి ఆలస్యంగా ఇంటికి వస్తే


నాన్న కొట్టిన దెబ్బల్లా.



సాయంత్రమైతే చాలు


ఎంతటి అలసటనైనా మరిపించే


అతి చల్లటి గాలి

నన్ను చుట్టుకుంటుంది


ఎంతటి కష్టాన్నైనా మైమరిపించే అమ్మ ప్రేమలా .


నేను దారి తప్పుతున్నప్పుడు


సరి చేయడానికి


నాన్నను పంపిన అమ్మే గుర్తొస్తోంది


మధ్యాహ్నం లేకుండా సాయంత్రం ప్రత్యక్షమౌతున్న చల్లని గాలిని చూస్తుంటే.



నా మొహం చూడగానే


కొన్ని సార్లు వెంటనే


ఓదార్చేందుకు అమ్మను పంపే నాన్నే గుర్తొస్తున్నాడు


ఉదయాలు బాధ పెట్టి


సాయంత్రాలు వెన్నెల వెలుగులకు కారణమయ్యే సూర్యుని చూస్తుంటే.


ప్రకృతిని ఎంత శోధించినా ఆశ్చర్యమేగా మానవునికి .

3 comments:

  1. నేను దారి తప్పుతున్నప్పుడు
    సరి చేయడానికి నాన్నను పంపిన అమ్మే గుర్తొస్తోంది
    మధ్యాహ్నం లేకుండా సాయంత్రం ప్రత్యక్షమౌతున్న చల్లని గాలిని చూస్తుంటే.
    నా మొహం చూడగానే
    కొన్ని సార్లు వెంటనే ఓదార్చేందుకు అమ్మను పంపే నాన్నే గుర్తొస్తున్నాడు...
    అమ్మ నాన్న మనకు ఎప్పుడూ ఎందుకు ఎలా గుర్తుకొస్తారో ఎంతో బాగా చెప్పారు ఆనంద్ కిరణ్ గారూ! మీ బ్లాగ్ అంత అందంగా వుంది మీ కవిత కూడా!మరిన్ని మంచి కవితలు రాయాలని కోరుకుంటున్నా

    ReplyDelete

వంతెన నిర్మిద్దాం రా!

నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...