తెలియని తపనేదో
నను తరుముతు ఉంటే,
పరుగెడుచున్నాను
తుది ఎరుగని గమ్యానికి.
చేరిన
ప్రతి మజిలీ
తుది మజిలీ
తను కాదని అనిపిస్తుంటే,
అపరిమిత
అనుభవ మూటను మోసుకుంటూ
నిత్యాసంతృప్తితో
అలసిన మనసుతో
పరుగులెడుతూ ,
మనసుని
సంపూర్తిగా సంతృప్తిపరిచే
తుది మజిలీ శోధిస్తూ ,
అపుడపుడూ
సేద తీరుతున్నా,
మనసుని మాటల్లోకి మారుస్తూ.
Subscribe to:
Post Comments (Atom)
వంతెన నిర్మిద్దాం రా!
నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...
-
ఓ సామాన్య మానవుడిగా బాధేస్తోంది విడిపోవడం అంటేనే. నాకు తెలుసు విడిపోయినా ,కలిసున్నా నాకు మారేది ఏమీ ఉండదని. ఐనా ఏదో బాధ. విడిపడి బాగు పడతాం...
-
ఆకాశం తిరస్కరించిందని ఓ మేఘం అతిగా కన్నీటిని వర్షిస్తూ లోకం నుండి అదృశ్యమవ్వాలని ప్రయత్నిస్తున్న క్షణంలో నేననుకున్నాను "ఇంత పిచ్చా?...
-
ఆశ, ఇంకా తెల్లగా కావాలని. చూస్తాను. "మేము మారుస్తాం" అనే ప్రకటన కొన్ని వందల సార్లు ఏదో టీవీ లో. నిజమని నమ్మి కొంటూనే వుంటా...
No comments:
Post a Comment