విజయం
ఓటమి దగ్గరలో ఉండి
విజయం కోసం పోరాడుతున్న
ఏ జట్టును చూసినా నాకనిపిస్తుంది .
ఆ జట్టులో నేనుండాలని
దానిని విజయ తీరాలకు చేర్చాలని.
హింసింపబడుతూ
వేదన అనుభవిస్తున్న
ఏ ప్రాణిని చూసినా
నాకనిపిస్తుంది .
హింసించే వాళ్ళను
నేనెదుర్కోవాలని ,
ఆ ప్రాణికి
ఆనందాన్నీ,స్వేచ్చనూ పంచాలని.
అలా
అనిపించడమే కదా
విజయాలను సృజించే,
స్వేచ్చనూ,ఆనందాన్నీ పంచే
పనులకు మూలం.
Saturday, July 26, 2008
Subscribe to:
Post Comments (Atom)
వంతెన నిర్మిద్దాం రా!
నీదీ , నాదీ ఒకే లక్ష్యం. కానీ మన మధ్య ఓ పెద్ద అగాథం. దానికి ఆ వైపున లక్ష్యం వైపు నువు నడుస్తున్నావ్, ఈ వైపున నేను నడుస్తున్న...
-
అమ్మా! క్షమించు నా దేశాన్ని ఆడవాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వలేని అరవై యేళ్ళ స్వతంత్ర దేశాన్ని. క్షమించు నా ప్రజల్ని చస్తున్నా చూస్తూ పోయే కొం...
-
ఆకాశం తిరస్కరించిందని ఓ మేఘం అతిగా కన్నీటిని వర్షిస్తూ లోకం నుండి అదృశ్యమవ్వాలని ప్రయత్నిస్తున్న క్షణంలో నేననుకున్నాను "ఇంత పిచ్చా?...
-
ఎక్కడికో తరలించుకపోబడుతున్న మన సహజ వనరులూ, అక్రమంగా ఆక్రమింప బడుతున్న కాలువలు,చెరువులూ, అభివృద్ది కోసం నిర్ధాక్షిణ్యంగా నరికివేయబడుతున్...
No comments:
Post a Comment